పుష్ప స్పెషల్ సాంగ్ కి వన్ మిలియన్ లైక్స్..!

Published on Dec 16, 2021 11:30 am IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన విడుదల కి సిద్దం అవుతోంది. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా వస్తుండటం తో దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అన్ని బాషల్లో ఒకేసారి విడుదల అవుతుండటం తో సినిమా ఏ తరహా వసూళ్లను రాబడుతుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక నటించగా, ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సమంత స్పెషల్ సాంగ్ అయిన ఊ అంటావా ఊ ఊ అంటావా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ పాట కి ఒక్క తెలుగు భాషలోనే 34 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. వన్ మిలియన్ కి పైగా లైక్స్ వచ్చాయి. సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :