వన్ మిలియన్ లైక్స్ తో “సర్కారు వారి పాట” ట్రైలర్ కి అద్దిరిపోయే రెస్పాన్స్!

Published on May 3, 2022 8:35 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు GMB ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ గ్రాండ్ ఈవెంట్ తో రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ కి ఊహించని రీతిలో భారీ మాస్ రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్ లో ఈ ట్రైలర్ కి 24 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాగా, వన్ మిలియన్ కి పైగా లైక్స్ రావడం విశేషం. ఈ చిత్రం 24 గంటల్లో ఇంకెన్ని రికార్డ్ లని సెట్ చేస్తుందో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :