జులై 30 నుండి ఆహా లో మమ్ముట్టి వన్…తెలుగు లో కూడా!

Published on Jul 25, 2021 8:13 pm IST


మమ్ముట్టి ప్రధాన పాత్రలో సంతోష్ విశ్వనాథ్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం వన్. ఈ చిత్రం ఆహా వీడియో ద్వారా విడుదల అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం లో గాయత్రి అరుణ్, మాథ్యూ థామస్, నిమిష శాజయన్, జోజూ జార్జ్, శ్రీజ దాస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే చిత్రం తెలుగు వెర్షన్ జులై 30 వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది. వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా ఈ చిత్రం తెలుగు లోకి రానుండటం తో ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీలక్ష్మి ఆర్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి బాబీ ప్రకాష్, సంజయ్ ప్రకాష్ లు స్క్రీన్ ప్లే అందించారు.

సంబంధిత సమాచారం :

సంబంధిత సమాచారం :