ఒకటి మిస్ చేసినా “దృశ్యం 2” నుంచి మరో అప్డేట్ వచ్చింది.!

Published on Sep 20, 2021 12:31 pm IST


టాలీవుడ్ అందరికీ ఫేవరెట్ హీరో వెంకీ మామ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “దృశ్యం 2” రిలీజ్ కి ఆల్రెడీ రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి తన లాస్ట్ సినిమా నారప్ప లా కాకుండా దీనిని మాత్రం అభిమానులు అంతా థియేటర్స్ లోనే రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఈరోజు మేకర్స్ మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఈ పోస్టర్ ని రిలీజ్ చెయ్యట్లేదు వాయిదా వేస్తున్నామని చెప్పారు.

సరే ఈ అప్డేట్ పక్కకి వెళ్లినా ఈ ఇంట్రెస్టింగ్ చిత్రం నుంచి మరో అప్డేట్ ని మేకర్స్ వదిలారు. అదే ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ చేసారు. ఈ చిత్రానికి సెన్సార్ బృందం క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ని ఇచ్చారట. ఆల్రెడీ మళయాళంలో జీతూ జోసెఫ్ ఈ సినిమాతో మొదటి పార్ట్ కి మించి సూపర్ హిట్ టాక్ అందుకున్నారు.

ఇక మన దగ్గర కూడా తానే దర్శకత్వం వహించడంతో ఇక్కడ కూడా రిజల్ట్ కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మరి ఈ చిత్రంలో వెంకటేష్ తో పాటు మీనా, నదియా, పూర్ణ తదితర నటులు కీలక పాత్రలు చేయగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఆశీర్వాద్ సినిమాస్, రాజ్ కుమార్ థియేటర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు. ఇక ఫైనల్ గా రిలీజ్ డేట్ కూడా త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ హామీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :