లాస్ట్ 90 రోజుల్లో “ఆదిపురుష్” దే హవా.!

Published on May 27, 2023 10:05 am IST


ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ హైప్ ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి. మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి మరో 1000 కోట్ల వసూళ్ల సినిమాగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని దర్శకుడు ఓంరౌత్ అయితే తెరకెక్కించాడు.

ఇప్పుడు పలు అప్డేట్స్ ఈవెంట్స్ తో బిజీగా బిజీగా ఉన్న చిత్ర యూనిట్ లేటెస్ట్ గానే సెకండ్ సింగిల్ ని కూడా అనౌన్స్ చేసింది. ఇక ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ఉందో తెలుస్తుంది. మెయిన్ గా యూట్యూబ్ లో అయితే గత మూడు నెలలు నుంచి కూడా “ఆదిపురుష్” కోసమే ఆడియెన్స్ అంతా ఆసక్తిగా చూస్తున్నారట.

ఈ 90 రోజుల్లో కూడా అత్యధికంగా వెతికిన టాపిక్ గా అయితే ఆదిపురుష్ ఇప్పుడు నిలిచింది. దీనితో యూట్యూబ్ అంతా కూడా ఆదిపురుష్ హవానే నడుస్తుంది అని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ సినిమా అయితే ఈ జూన్ 16న గ్రాండ్ గా పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :