బన్నీయే చెక్ పెడితే బాగుంటుందేమో..

Allu arjun

మొన్న జరిగిన ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకకు మొత్తం మెగా ఫ్యామిలీ హీరోలంతా హాజరైన సంగతి తెలిసిందే. కానీ అల్లు అర్జున్ మాత్రం రాలేదు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రగడ మొదలైంది. అల్లు అర్జున్ గైర్హాజరు గురించి అటు మెగా ఫ్యాన్స్ పెద్దగా రియాక్ట్ కాలేదు. షూటింగ్ ఉండటం వలనే రాలేకపోయాడని అంతా అర్థం చేసుకున్నారు.

పైగా అల్లు అరవింద్ వేదిక మీద సినిమాను, చరణ్, చిరంజీవిల గురించి గొప్పగా మాట్లాడారు. సినిమా చూసిన మొదటి ప్రేక్షకుడ్ని తానేనని.. చిత్రం చాలా బాగుందని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. నటించిన చిరంజీవికన్నా నిర్మించిన చరణ్ పట్ల ఎక్కువ ఎమోషనల్ అయ్యానని పొగిడారు.

కానీ కొన్ని వర్గాలు మాత్రం పనిగట్టుకుని మరీ బన్నీకి, మెగా కుటుంబానికి నడుమ విభేదాలు ఉన్నాయనే ప్రచారం స్టార్ట్ చేసింది. వారికి సమాధానం ఇవ్వడం కోసం ఫ్యాన్స్ కూడా గొడవలోకి దిగారు. దీంతో రచ్చ చిలికి చిలికి గాలివాన అయింది. రెండు రోజుల బట్టి నడుస్తూనే ఉంది. ఈ గొడవ తక్షణమే చల్లారాలంటే బన్నీ స్పందించాల్సిందే.

Exit mobile version