మిగిలిన 2020 మెగా బ్రదర్స్ దే..!

Chiru Pawan

కరోనా దెబ్బ సినిమా పరిశ్రమ కళ కోల్పోయింది. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని నిలిచిపోయాయి. థియేటర్స్ మూసివేయడంతో పూర్తి అయిన సినిమాలు కూడా విడుదల కాని పరిస్థితి నెలకొని ఉంది. ఇక ఈ ఏడాది స్టార్ హీరోల సందడి ఉండేలా కనిపించడం లేదు. మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ మరియు బన్నీ వచ్చే ఏడాది తమ చిత్రాలు విడుదల చేయనున్నారు.

ఇక పోతే స్టార్ హీరోల లిస్ట్ లో ఉన్న మెగా బ్రదర్స్ మాత్రమే ఈ ఏడాది తమ సినిమాలు విడుదల చేసే సూచనలు కలవు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది. థియేటర్స్ ఓపెన్ అయితే ఆ సినిమా ఖచ్చితంగా విడుదల అవుతుంది. ఈ ఏడాది విదులయ్యే సినిమాలో వకీల్ సాబ్ మొదటి వరసలో ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న ఆచార్య సినిమా కూడా 40శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలోనే సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారు. కాబట్టి 2020లో మెగా బ్రదర్స్ సందడి చేయడం ఖాయం అంటున్నారు.

Exit mobile version