ఆ లిస్ట్ లో ఉన్న ఒకే ఒక్క తెలుగు ప్రొడక్షన్ హౌస్ “మైత్రి మూవీ మేకర్స్”

ఆ లిస్ట్ లో ఉన్న ఒకే ఒక్క తెలుగు ప్రొడక్షన్ హౌస్ “మైత్రి మూవీ మేకర్స్”

Published on Jul 10, 2024 4:00 PM IST

FC – Ormax 2024 సంవత్సరం కి సంబందించిన ప్రొడక్షన్ హౌస్‌ల పవర్ లిస్ట్‌ను ప్రకటించింది. పవర్ లిస్ట్‌లో ఉన్న ఏకైక తెలుగు ప్రొడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్. శ్రీమంతుడు బ్లాక్‌బస్టర్‌తో 2015లో ప్రొడక్షన్‌లోకి ప్రవేశించి, జనతా గ్యారేజ్ మరియు రంగస్థలంతో హ్యాట్రిక్ పూర్తి చేసిన మైత్రీ మూవీ మేకర్స్ 9 సంవత్సరాలలో భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది. 2023లో, వారు సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డిలతో ముందుకు వచ్చారు. చిరంజీవి మరియు బాలకృష్ణ ఇద్దరికీ ఇవి భారీ కమర్షియల్ సక్సెస్ మూవీస్.

ఈ ప్రొడక్షన్ హౌస్ రెండు జాతీయ అవార్డ్ చిత్రాలను అందించింది, అవే పుష్ప మరియు ఉప్పెన. అల్లు అర్జున్ మరియు సుకుమార్‌ల పుష్ప 2 ప్రొడక్షన్ హౌస్ నుండి తదుపరి పెద్ద విడుదల కాగా, పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్‌ల ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాణ దశలో ఉన్న మరో బిగ్ మూవీ. వారు నడికర్‌తో మలయాళంలోకి అడుగుపెట్టగా, సన్నీ డియోల్ మరియు బాబీల చిత్రం వారి బాలీవుడ్ ఎంట్రీని సూచిస్తుంది. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌లకు చెందిన మైత్రీ మూవీ మేకర్స్ యూనివర్సల్ అప్పీల్ ఉండే సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. ప్రొడక్షన్ హౌస్‌కి FC-Ormaxలో చోటు దక్కడం మరో పెద్ద గుర్తింపు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు