పుష్ప నుండి విడుదలైన స్పెషల్ సాంగ్..!

Published on Dec 10, 2021 7:02 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా తో కలిసి నిర్మిస్తోంది. అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న నటించగా, ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో చిత్రం ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది.

ఈ చిత్రం కి సంబంధించిన మరొక స్పెషల్ సాంగ్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. ఊ అంటావా ఊ ఊ అంటావా అంటూ సాగే ఈ పాట విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పాటలో ప్రముఖ నటి సమంత ఆడి పాడింది. అన్ని భాషల్లో ఈ పాటను విడుదల చేయడం జరిగింది. సుకుమార్, అల్లు అర్జున్, దేవీ శ్రీ ప్రసాద్ కాంబో లో వచ్చిన స్పెషల్ సాంగ్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఈ పాట కూడా అదే తరహా లో ఉండటం విశేషం. డిసెంబర్ 17 వ తేదీన విడుదల అవుతున్న ఈ చిత్రం లో మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటించగా, సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :