“పుష్ప ది రైజ్” నుండి సమంత స్పెషల్ సాంగ్ రిలీజ్

Published on Jan 7, 2022 9:52 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పుష్ప ది రైజ్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ ను సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మించడం జరిగింది. రష్మీక మందన్న ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించగా, సమంత స్పెషల్ సాంగ్ లో ఆడి పాడింది.

సమంత స్పెషల్ సాంగ్ అయిన ఊ అంటావా ఊ ఊ అంటావా ఫుల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. విడుదల అయిన కొద్ది సేపటికే యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ ను సాధించడం జరిగింది. అన్ని బాషల్లో విడుదల అయిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పాన్ ఇండియా మూవీ గా వచ్చిన ఈ చిత్రం రెండవ పార్ట్ పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :