
వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ప్రస్తుతం టాలీవుడ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు చేస్తున్నారు. సాయి కొర్రపాటి ‘ఈగ’, ‘లెజెండ్’ లాంటి భారీ బడ్జెట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేస్తూనే మనసుకు హత్తుకునే ‘అందాల రాక్షసి’ లాంటి లో బడ్జెట్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఇదే సంస్థ నుండి రానున్న మరో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఊహలు గుసగుసలాడే’.
వినూత్నంగా ప్రమోషన్స్ చేసిన ఈ సినిమా జూన్ 20న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. చిన్న సినిమా అయినప్పటికీ ఇండస్ట్రీలో ఈ సినిమాపై బాగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అలాగే ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, కామెడీ టీజర్స్, ఫ్రెష్ విజువల్స్ అందరినీ అక్కట్టుకోవడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కమెడియన్ గా పేరున్న శ్రీని అవసరాల దర్శకుడిగా చేస్తున్న మొదటి సినిమా కావడం కూడా ఈ సినిమాకి హెల్ప్ అయ్యింది. నాగ సౌర్య, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కళ్యాణి కోడూరి సంగీతం అందించాడు.