ఓవర్సీస్ లో హల్ చల్ చేస్తున్న ‘ఊహలు గుసగుసలాడే’

Oohalu-gusagusa-lade

భారీ బడ్జెట్, భారీ క్యాస్టింగ్ ఉన్న చిత్రాలే కనీస స్థాయి విజయం సాధించడానికి నానాపాట్లు పడుతున్న తరుణంలో.. ఒక చిన్న చిత్రం, స్టార్ క్యాస్టింగ్ అనేది లేని ఓ సాధారణ చిత్రం, ప్రేక్షకుల ఆదరణను నోచుకోవడంతోపాటు, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న చిత్రం “ఊహలు గుసగుసలాడే”.

శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఓవర్సీస్ లో తొలి మూడు రోజుల్లోనే 48,232 డాలర్స్ వసూలు సాధించి సరికొత్త రికార్డును సాధించింది. ఈ విధంగా తమ చిత్రం ఓవర్సీస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ విజయపధంలో దూసుకెళుతుండడం చాలా సంతోషంగా ఉందని “ఊహలు గుసగుసలాడే” చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.

Exit mobile version