తారక్, టాలీవుడ్ లపై “ఊసరవెల్లి” నటి కీలక కామెంట్స్ వైరల్!

Published on Feb 12, 2022 8:00 am IST


రీసెంట్ గా మన టాలీవుడ్ మాస్ హీరోస్ లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు మన టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ వర్గాల్లో కూడా ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. బాలీవుడ్ కి చెందిన బిగ్ స్టార్ అయినటువంటి హీరోయిన్ దీపికా పదుకొనె ఎన్టీఆర్ తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని తన మనసులో మాట చెప్పడం అత్యంత ఆసక్తికర అంశంగా మారిపోయింది.

దీనితో ఇప్పుడు మరికొంతమంది సెలెబ్రెటీస్ లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారగా లేటెస్ట్ గా ఎన్టీఆర్ తో నటించిన ఒక నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం మరింత ఆసక్తిగా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అవుట్ స్టాండింగ్ అండ్ అండర్ రేటెడ్ చిత్రాల్లో “ఊసరవెల్లి” ఒకటి. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్ తమన్నా తో సినిమా మొత్తం ట్రావెల్ అయ్యే ఫ్రెండ్ పాత్ర ఉంటుంది ఆమెనే పాయల్ ఘోష్.

ఇప్పుడు ఎన్టీఆర్ పై దీపికా చెప్పిన కామెంట్స్ విని ఆమె స్టన్ అయ్యింది. ఊసరవెల్లి సినిమా కోసం ఎన్టీఆర్ నటన కోసం ఇది వరకే తాను చెప్పానని అప్పుడు చాలా మంది నన్ను విమర్శించారు. కానీ ఇప్పుడు అదే నిజం అయ్యింది. ఇక మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, టాలీవుడ్ ఖచ్చితంగా బాలీవుడ్ ని మించిపోతుంది అని నేను ఎప్పటికీ తప్పు అవ్వను అని చాలా కాన్ఫిడెన్స్ కామెంట్స్ చేసింది. దీనితో ఇవి మంచి వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :