యువ నటుడు వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో రెనైసెన్స్ పిక్చర్స్, సోనీ పిక్చర్స్ సంస్థ ల పై గ్రాండ్ లెవెల్లో తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న లేటెస్ట్ ఏరియల్ యాక్షన్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఈ మూవీలో మానుషీ చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్, ఫస్ట్ గ్లింప్స్ టీజర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఈ మూవీ యొక్క ఫైనల్ స్ట్రైక్ ని ఫిబ్రవరి 20న రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.
కాగా ఫైనల్ స్ట్రైక్ ని రేపు ఉదయం 10 గం. ల నుండి హైదరాబాద్ ఏ ఏ ఏ సినిమాస్ స్కీన్ 1లో జరిగే ఈవెంట్ గా గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసారు. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఏస్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.