“ఆరెంజ్” మరో స్పెషల్ షో రెడి.!

Published on Mar 29, 2023 7:03 am IST

మెగా పవర్ గ్లోబల్ స్టార్ హీరోగా నటించిన చిత్రాల్లో రీసెంట్ గా అయితే తన కెరీర్ లో ప్లాప్ సినిమా అయినటువంటి “ఆరెంజ్” చిత్రాన్ని నిర్మాత నాగబాబు చరణ్ బర్త్ డే కానుకగా రీ రిలీజ్ చేయగా ఈ రీ రిలీజ్ మాత్రం ప్రతి ఒక్కరికీ షాకిచ్చింది అని చెప్పాలి. నెవర్ బిఫోర్ రెస్పాన్స్ తో అయితే ఈ సినిమా థియేటర్లు లో సెన్సేషనల్ గా మారింది. మొత్తం మూడు రోజులు కూడా ఆల్ మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమా ఆదరగొట్టగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అయితే ఆల్ టైం రికార్డ్ సెట్ చేసింది.

ఇక లేటెస్ట్ గా అయితే ఆరెంజ్ మరో స్పెషల్ షో ని ఈ శ్రీరామ నవమి సందర్భంగా లాక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ షో అయితే సంధ్య 70 ఎంఎం లో ప్లాన్ చేశారట. అయితే ఈ పర్టిక్యులర్ షో కి పలువురు సెలెబ్రెటీ లు కూడా హాజరు కానున్నారని కన్ఫర్మ్ అయ్యింది. రామనవమి రోజు ఉదయం 8 గంటలకి ఈ షో ని ప్లాన్ చేశారు. ఇక మొత్తానికి అయితే రీ రిలీజ్ లో ఆరెంజ్ హవా ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి. మరి ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా హరీష్ జై రాజ్ సంగీతం అందించారు అలాగే జెనీలియా హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం :