క్రాస్ రోడ్స్ లో మరో సెన్సేషనల్ రికార్డ్ తో “ఆరెంజ్”.!

Published on Mar 28, 2023 10:01 am IST

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే అయితే ఈసారి కనీ వినీ ఎరుగని రేంజ్ లో జరిగింది అని చెప్పాలి. అటు ఆఫ్ లైన్ ఇటు ఆన్ లైన్ అలాగే మెగాస్టార్ ఇంట కూడా చాలా గ్రాండ్ గా చరణ్ పుట్టినరోజు వేడుకలు ఈసారి జరిగాయి. అయితే ఈసారి బర్త్ డే కానుకగా చరణ్ కెరీర్ లో ప్లాప్ మరియు కల్ట్ క్లాసిక్ సినిమా అయినటువంటి “ఆరెంజ్” ని రీ రిలీజ్ చేయగా దీనికి మాసివ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది.

నైజాం లో ఆల్ మోస్ట్ భారీ వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అయితే మొదట 12 షోల కి 12 ఫుల్స్ అయ్యి ఫస్ట్ ఆల్ టైం రికార్డు కొట్టగా ఇపుడు మూడు రోజుల్లో మరో సెన్సేషనల్ రికార్డు అందుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ మూడు రోజుల్లో ఆరెంజ్ చిత్రం 29 లక్షలకు పైగా గ్రాస్ నమోదు అయ్యిందట. దీనితో మూడు రోజుల్లో 30 లక్షల మేర వసూళ్లు రాబట్టిన సినిమాగా ఆరెంజ్ ఇప్పుడు మరో సెన్సేషనల్ ఆల్ టైం రికార్డు నమోదు చేసింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :