పెరిగిన “ఓరి దేవుడా” వసూళ్లు..నైజాంలో డే 2 వసూళ్ల వివరాలు!

పెరిగిన “ఓరి దేవుడా” వసూళ్లు..నైజాంలో డే 2 వసూళ్ల వివరాలు!

Published on Oct 23, 2022 2:00 PM IST

లేటెస్ట్ గా టాలీవుడ్ లో రిలీజ్ అయ్యిన చిత్రాల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా మిథిలా పాల్కర్ హీరోయిన్ గా వెంకీ మామ ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం “ఓరి దేవుడా” కూడా ఒకటి. ఒరిజినల్ గా ఓ మై కడవులే ని తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ నే తీసిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి టాక్ తెచ్చుకొని మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకుంది.

మరి లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం నైజాం లో రెండో రోజు వసూళ్ల డీటెయిల్స్ తెలుస్తున్నాయి. మొదటి రోజు ఈ సినిమా 48 లక్షల నెట్ వసూళ్లు అందుకోగా రెండో రోజు ఈ వసూళ్లు మంచి ఇంప్రూవ్ అయ్యాయి. మరి రెండో రోజుకి అయితే 60 లక్షల నెట్ వసూళ్లు వచ్చాయి. దీనితో మరింత స్ట్రాంగ్ గా ఈ చిత్రానికి వసూళ్లు నమోదు అయ్యాయని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అయితే లియోన్ జేమ్స్ సంగీతం అందించగా సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీవీపీ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు