మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ మరియు ఆశా భట్ కీలక పాత్రల్లో నటించిన ఓరి దేవుడా చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తమిళ చిత్రం ఓహ్ మై కడవులే కి ఈ చిత్రం అధికారిక రీమేక్. తమిళ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన అశ్వత్ మరిమాతు ఈ రీమేక్ కి కూడా దర్శకత్వం వహించారు.
ఈరోజు ట్విట్టర్ లో తాను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి వీరాభిమానినని, ఆ నటుడి అభిమానులైన సెలబ్రిటీ జాబితాలో చేరిపోయానని వెల్లడించారు. ఓరి దేవుడాలో జూనియర్ ఎన్టీఆర్ గురించి చాలా రిఫరెన్స్‌లు ఉన్నాయని ఓ అభిమాని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అతనికి సమాధానమిస్తూ, స్టార్ హీరోకి విపరీతమైన అభిమానిని కాబట్టి, అతను అతని రిఫరెన్స్ లని ఉపయోగించినట్లు తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Yes I did have lot of reference of NTR sir cos I am a big fan of him ! ???? https://t.co/OhbBJ3vb91
— Ashwath Marimuthu (@Dir_Ashwath) October 23, 2022