నైజాంలో “ఓరి దేవుడా” మొదటి రోజు వసూళ్లు ఇవే.!

నైజాంలో “ఓరి దేవుడా” మొదటి రోజు వసూళ్లు ఇవే.!

Published on Oct 22, 2022 1:00 PM IST

లేటెస్ట్ గా ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యినటువంటి చిత్రాల్లో యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా మిథిలా పాల్కర్ హీరోయిన్ గా దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ రోమ్ కామ్ ఫాంటసీ డ్రామా “ఓరి దేవుడా” కూడా ఒకటి. మరి విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకోగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ నే నమోదు చేసినట్టుగా తెలుస్తుంది.

మరి నైజాం లో మొదటి వసూళ్లు చూసినట్టు అయితే ఈ చిత్రం 48 లక్షల గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఈ పోటీలో మంచి నెంబర్ అనే చెప్పాలి. మరి వారాంతంలో సినిమా ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించగా పీవీపీ సినిమాస్ వారు నిర్మాణం వహించారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు