ఎంటర్టైన్మెంట్, ఫాంటసి అంశాలతో ఆకట్టుకుంటున్న ‘ఓరి దేవుడా’ ట్రైలర్

Published on Oct 7, 2022 6:24 pm IST

యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా విక్టరీ వెంకటేష్ ఒక సర్ప్రైజింగ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓరి దేవుడా. మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని పివిపి సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు కలిసి ఎంతో గ్రాండ్ గా నిర్మించాయి. తమిళ్ లో మంచి విజయం అందుకున్న ఓహ్ మై కడువులె మూవీకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన ఓరి దేవుడా, రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఇక ఒరిజినల్ వర్షన్ ని తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తు దీనికి కూడా దర్శకత్వం వహించారు.

ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, సాంగ్స్ తో మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక కొద్దిసేపటి క్రితం ఈ మూవీ యొక్క అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది యూనిట్. ముందుగా ట్రైలర్ లో దేవుడి పాత్రలో వెంకటేష్ కనిపిస్తారు, ఆయనతో పాటు రాహుల్ రామకృష్ణ ఫన్నీ డైలాగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే యువకుడిగా విశ్వక్ సేన్ నటన బాగుంది. ట్రైలర్ లో కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫాంటసీ అంశాలతో పాటు విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో బాగున్నాయి. మొత్తంగా ఓరి దేవుడా ట్రైలర్ ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు మరింతగా పెంచేసింది అని చెప్పాలి. కాగా ఈ మూవీని అక్టోబర్ 21న దీపావళి కానుకగా వరల్డ్ వైడ్ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :