‘ఓరి వారి’ నా కెరీర్ లో బెస్ట్ సాంగ్ అవుతుంది : సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నాచురల్ స్టార్ నాని

Published on Feb 13, 2023 10:28 pm IST


నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా. ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఆకట్టుకుని విపరీతంగా హైప్ ఏర్పరిచాయి. ఇక నేడు ఈ మూవీ నుండి ఓరి వారి అనే పల్లవితో సాగే బ్రేకప్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు మేకర్స్. కాగా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ, దసరా లో నాకు చాలా ఇష్టమైన పాట ఓరి వారి సాంగ్ నా పర్సనల్ ఫిలాసఫీకి దగ్గర ఉంటుంది.

ఒకసారి అమ్మాయి మనది కాదన్న తర్వాత కాసేపు బాధపడాలి ఇలాంటి పాటలు వినాలి. ఇంటికెళ్ళి అవ్వ ఒడిలో దూరి చంటి బిడ్డలా పడుకోవాలి. అదే ఈ పాట లిరిక్స్. శ్రీమణి చాలా అద్భుతంగా రాశారు. సంతోష్ నారాయణ్ బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు. విజువల్ గా ఈ పాట నా కెరీర్ లో బెస్ట్ సాంగ్. మార్చి 30న స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు స్టన్ అయిపోతారు. వినే కొద్ది నచ్చే పాటిది. నెలలు తరబడి నా చెవిలో మ్రోగుతూనే వుంది. అదే ఎఫెక్ట్ మీ మీద కూడా ఉంటుందని నమ్ముతున్నాను. దసరాకి చాలా సెలబ్రేషన్స్ ఈవెంట్స్ వుంటాయి. ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ సినిమాకి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మార్చి 30న పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :