“భీమ్లా” నుంచి అసలు సిసలు మాస్ ముందుంది గేట్ రెడీ!

Published on Oct 17, 2021 9:00 am IST

పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ మరియు రాణా దగ్గుబాటిల కాంబోలో తెరకెక్కుతున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ముందు అనుకున్న దానికంటే ఎక్కువ హైప్ నే వచ్చింది అని చెప్పాలి. అలాగే దీనికి ప్రధాన కారణంగా కూడా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అని కూడా చెప్పొచ్చు. తాను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇప్పుడు వరకు వచ్చిన రెండు సాంగ్స్ కానీ అసలు ఈ సినిమా ఒక రీమేక్ అనే మార్క్ ని గుర్తు చేయడం లేదు.

ఆ హైప్ థమన్ వల్ల వచ్చింది. రీసెంట్ గా వచ్చిన భీమ్లా సెకండ్ సింగిల్ అనుకున్నంత స్థాయి రెస్పాన్స్ ని అందుకోలేదు. ముందు వచ్చిన అప్డేట్స్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ కానీ ఇది కూడా ఫ్రెష్ గానే ఉంది. దీనితో ఈ షాకింగ్ రెస్పాన్స్ చూసి కొంతమంది నిరాశపడ్డారు.

మరి వాళ్ళకి ఇంకొంతమందికి సమాధానం ఇచ్చేలాంటి అప్డేట్స్ భీమ్లా నుంచి కొన్ని రోజుల్లో రానున్నట్టు తెలుస్తుంది. దీనిపై థమన్ కూడా అదే అంటున్నాడు. ఇంకా ఈ సినిమా నుంచి భీమ్లా థీమ్ మ్యూజిక్ అలాగే అసలైన సాంగ్ పవన్ కళ్యాణ్ పాడిన ఫోక్ మాస్ బీట్ కూడా ఉంది. ఇవి మాత్రం మాస్ లో ఇంకో లెవెల్ కి వెళ్లడం గ్యారెంటీ అని ముందే చెప్పెయ్యొచ్చు. కాకపోతే ఇవి వచ్చే వరకు ఎదురు చూడక తప్పదు.

సంబంధిత సమాచారం :