ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలివే..!

Published on Feb 8, 2022 11:00 pm IST

యావత్ సినీ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల సంబరం ప్రారంభమయ్యింది. మార్చి 27, 2022న 94వ ఆస్కార్‌ పురస్కారాల ప్రధానోత్సవం జరగనుండడంతో ఈ ఏడాది వివిధ కేటగిరీల్లో పోటీపడే చిత్రాల తుది జాబితాను తాజాగా అకాడమీ కమిటీ ప్రకటించింది.

అయితే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 276 చిత్రాలు పోటీ పడగా, అందులో భారత్ నుంచి సూర్య “జై భీమ్‌”, మోహన్‌లాల్ “మరక్కార్” చిత్రాలు స్క్రీనింగ్ కాగా, తాజాగా ప్రకటించిన తుది జాబితాలో ఈ రెండింటిల్లో ఒక్క చిత్రం కూడా లేకపోవడంతో భారతీయ చిత్రాలకే నిరాశే మిగిలింది.

ఉత్తమ చిత్రాల తుది జాబితా:

1) బెల్‌ఫాస్ట్
2) డోస్ట్ లాకప్
3) కోడా
4) డ్యూన్
5) డ్రైవ్ మై కార్
6) కింగ్ రిచర్డ్
7) నైట్ మేర్ అల్లీ
8) లికోరైస్ పిజా
9) వెస్ట్ సైడ్ స్టోరీ
10) ది పవర్ ఆఫ్ ది డాగ్

సంబంధిత సమాచారం :