ఓటిటి, థియేటర్ల లో ఈ వారం అలరించే చిత్రాలివే!

ఓటిటి, థియేటర్ల లో ఈ వారం అలరించే చిత్రాలివే!

Published on Jun 14, 2022 9:00 PM IST

థియేటర్ల లో, ఆన్లైన్ వేదిక గా ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి వరుస సినిమాలు సిద్దం గా ఉన్నాయి. ఈ వారం థియేటర్ల లో మరియు ఓటిటి లో వచ్చే సినిమాలు ఏంటో చూద్దాం.

విరాట పర్వం: రానా దగ్గుపాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా వేణు ఉడుగుల దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం విరాట పర్వం. ఈ చిత్రం జూన్ 17, 2022 న థియేటర్ల లో విడుదల కి సిద్దం అవుతోంది. నక్సలిజం నేపథ్యం లో సాగే ఈ చిత్రం లో ప్రేమ కథను చూపించబోతున్నాడు డైరెక్టర్. ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గాడ్సే: సత్యదేవ్ హీరోగా గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం గాడ్సే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం జూన్ 17, 2022 న థియేటర్ల లో విడుదల కి సిద్దం అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కిరోసిన్: ధృవ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ను జూన్ 17, 2022 న థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

జయమ్మ పంచాయతీ: ప్రముఖ యాంకర్ సుమ కనకాల లీడ్ రోల్ లో, విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం జయమ్మ పంచాయతీ. థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలం అయిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో జూన్ 14 నుండి స్ట్రీమ్ కానుంది.

రెక్కీ: శ్రీరామ్, శివ బాలాజీ, ధన్య బాలకృష్ణ లీడ్ రోల్స్ లో, పోలూరు కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన వెబ్ సిరీస్ రెక్కీ. ఈ వెబ్ సిరీస్ నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వెబ్ సిరీస్ జీ 5 లో జూన్ 17 నుండి స్ట్రీమ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

O2: విఘ్నేష్ శివన్ దర్శకత్వం లో నయనతార లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ చిత్రం డైరక్ట్ డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం జూన్ 15 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. వీటితో పాటుగా

నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం గాడ్స్ ఫేవరేట్ ఇడియట్ వెబ్ సిరీస్ జూన్ 17 న, ది రాత్ ఆఫ్ గాడ్ జూన్ 15 న, హిందీ వెబ్ సిరీస్ షి జూన్ 17 న, ఆపరేషన్ రోమియో జూన్ 18 న, సీబీఐ 5 ద బ్రెయిన్ జూన్ 18 న ప్రసారం కానున్నాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ వారం అవతార పురుషా 1 జూన్ 14 న, సుజల వెబ్ సిరీస్ జూన్ 17 న ప్రసారం కానున్నాయి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వారం మాసూం జూన్ 17 న ప్రసారం కానుంది.

సోని లైవ్ లో ఈ వారం సాల్ట్ సిటీ వెబ్ సిరీస్ జూన్ 16 నుండి ప్రసారం కానుంది.

జీ 5 లో ఈ వారం ఇన్ఫినిటీ స్టార్మ్ జూన్ 14 న, ఫింగర్ టిప్ వెబ్ సిరీస్ జూన్ 17 నుండి ప్రసారం కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు