ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “అమిగోస్”.!

Published on Mar 4, 2023 11:02 am IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం “అమిగోస్” కోసం తెలిసిందే. యంగ్ హీరోయిన్ ఆషిక రంగనాథ్ నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియెన్స్ ని మెప్పించింది. అయితే థియేటర్స్ లో అనుకున్న రేంజ్ బాక్సాఫీస్ వసూళ్లతో ఆకట్టుకోలేదు కానీ సినిమా చూసినవారికి మాత్రం మంచి ట్రీట్ ఇచ్చింది అని చెప్పాలి.

ఇక ఇప్పుడు అయితే ఫైనల్ గా ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న వారికి ఓ క్లారిటీ తెలుస్తుంది. ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిన దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ అయితే అయితే ఈ సినిమా ఈ ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనిని అయితే నెట్ ఫ్లిక్స్ వారు వారి యాప్ లో అప్డేట్ చేశారు. సో అప్పటి వరకు అయితే ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :