ఓటిటి పార్ట్నర్, రిలీజ్ టైం ఫిక్స్ చేసుకున్న “మనమే”?

ఓటిటి పార్ట్నర్, రిలీజ్ టైం ఫిక్స్ చేసుకున్న “మనమే”?

Published on Jul 3, 2024 1:10 AM IST

రీసెంట్ గా మన టాలీవుడ్ దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “మనమే”. మరి గత జూన్ నెలలో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం డీసెంట్ టాక్ ని తెచ్చుకుని ఫ్యామిలీ ఆడియెన్స్ ని అయితే మెప్పించింది. ఇక ఈ సినిమాతో వచ్చిన పలు చిత్రాలు ఆల్రెడీ ఓటిటిలో వచ్చేసాయి కానీ ఈ సినిమా మాత్రం ఇంకా రాలేదు. ఇక దీనిపై లేటెస్ట్ బజ్ అయితే తెలుస్తుంది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు కూడా ముందుగా ఎవరికీ అనేది రివీల్ కాలేదు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాని డిస్నీ + హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇందులో ఈ చిత్రం జూలై రెండో వారం లో అలా స్ట్రేంయిగ్ రావచ్చని వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి. ఇక ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వాహాడ్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు