ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “నేనే వస్తున్నా”.!

Published on Sep 30, 2022 12:00 am IST


గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా ఇప్పుడు వరుస పెట్టి అనేక చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో ఈ ఏడాదిలో సుమారు నాలుగు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి వాటిలో అయితే ఇపుడు వచ్చిన మరో చిత్రమే ‘నేనే వస్తున్నా”. దర్శకుడు సెల్వ రాఘవన్ తో ధనుష్ చేసిన మరో చిత్రం ఇది కాగా ఇందులో ధనుష్ డ్యూయల్ రోల్ ని అయితే చేసాడు.

తమిళ్ లో లో ఈ చిత్రం నానే వరువీన్ గా ఈరోజే రెండు భాషల్లో అయితే మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఓటిటి అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఈ చిత్రాన్ని వారు కొన్ని వారాల తర్వాత అయితే చిత్రాన్ని స్ట్రీమింగ్ కి తీసుకున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందించగా కలై పులి థాను నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :