డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న సమంత “యశోద”

డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న సమంత “యశోద”

Published on Nov 11, 2022 7:12 PM IST

సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరి, హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం తన డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకుంది. యశోద యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.

ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ థ్రిల్లర్‌లో రావు రమేష్, సంపత్, మురళీ శర్మ, కల్పిక, వరలక్ష్మి శరత్‌కుమార్, దివ్య శ్రీపాద తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీదేవి మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు