ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “ది ఘోస్ట్” చిత్రం..!

ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “ది ఘోస్ట్” చిత్రం..!

Published on Oct 5, 2022 3:34 PM IST

అక్కినేని నాగార్జున హీరోగా గ్లామరస్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా టాలెంటెడ్ ఫిలిం మేకర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం “ది ఘోస్ట్”. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో డే 1 ను ప్రీమియర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంది. ఇక ఈ చిత్రం రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ కి సంబంధించి అప్డేట్ అయితే తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని ప్రపంచ దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారట. మరి భారీ ధరని ఇచ్చి తెలుగు సహా హిందీ హక్కులు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ చిత్రం కూడా అయితే ఇప్పుడప్పుడే ఓటిటి లో కూడా రాదు సో అప్పటివరకు థియేటర్స్ లో ఈ సాలిడ్ థ్రిల్లర్ ని చూసి ఎంజాయ్ చెయ్యాల్సిందే. ఇక ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ మరియు పుష్కర్ రామ్ మోహన్ రావు లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు