‘ది రాజా సాబ్’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులో ఉంటుందంటే..?

The Raja Saab

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab) భారీ అంచనాల మధ్య గ్రాండ్ ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా హారర్ కామెడీ జానర్‌లో రూపొందగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ భారీ రెస్పాన్స్‌ను అందుకున్నాయి. ఇక ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి రావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి మరింత పెరిగింది.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ పార్ట్‌నర్‌గా జియో హాట్‌స్టార్ డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. ఈ మేరకు మూవీ టైటిల్ కార్డ్స్‌లో వెల్లడించారు. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యాక జియో హాట్‌స్టార్ వేదికపై ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి ట్రీట్ ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version