తన వెబ్ సిరీస్ టైటిల్ అనౌన్స్ చేసిన పవన్ సాదినేని

Published on Jun 2, 2023 11:07 pm IST

ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి వంటి సినిమాలతో ఆడియన్స్ నుండి మంచి పేరు అందుకున్న యువ దర్శకుడు పవన్ సాదినేని తాజాగా ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఏడాదికి పైగా కొత్త సిరీస్‌పై కసరత్తు చేస్తూ ఎట్టకేలకు ఈరోజు దాని టైటిల్‌ను అనౌన్స్ చేసారు. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది.

కాగా ఈ తెలుగు వెబ్ సిరీస్ టైటిల్ దయ గా ఫిక్స్ చేసారు. ఈ సిరీస్ పోస్టర్‌ను చిత్ర నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ఇక రేపు దీనికి సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తానని కూడా ఆయన పేర్కొన్నారు. జెడి చక్రవర్తి ఈ సిరీస్‌లో ప్రధాన పాత్ర చేస్తుండగా ప్రముఖ నటీనటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు రేపు విడుదల కానున్నాయి.

సంబంధిత సమాచారం :