వరుణ్ తేజ్ “గని” ఓటిటి రిలీజ్ కి డేట్ ఫిక్స్..?

Published on Apr 9, 2022 6:00 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “గని”. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటితో చేసిన ఈ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ డ్రామా నిన్ననే రిలీజ్ అయ్యింది. వరుణ్ తేజ్ నుంచి ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకొని థియేటర్స్ లో రన్ కొనసాగిస్తోంది. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని “ఆహా” వారే కొనుగోలు చెయ్యగా దీనిని ఈ ఏప్రిల్ నెలలోనే స్ట్రీమింగ్ తీసుకురానున్నట్టు తెలుస్తుంది. మరి ఈ టాక్ ప్రకారం అయితే ఈ ఏప్రిల్ 29న ఈ చిత్రం ఓటిటి లో వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే అల్లు బాబీ మరియు సిద్ధూ ముద్ద లు నిర్మాణం అందించారు.

సంబంధిత సమాచారం :