టాక్..”విక్రమ్” ఓటిటి రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయ్యిందా.?

టాక్..”విక్రమ్” ఓటిటి రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయ్యిందా.?

Published on Jun 19, 2022 1:21 PM IST

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో చేసిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “విక్రమ్” కోసం తెలిసిందే. మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం భారీ వసూళ్లను అందుకొని తమిళ్ లో రికార్డు గ్రాసర్ గా నిలిచింది. అంతే కాకుండా అక్కడ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇంకా థియేటర్స్ లో స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తుండగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై ఇప్పుడు లేటెస్ట్ బజ్ బయటకి వచ్చింది.

ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ + హాట్ స్టార్ వాళ్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇందులో ఈ చిత్రం ఈ జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనిపై అయితే అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ మరియు మహేంద్రన్ లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు