ఓటిటిలో కార్తీ “సర్దార్” రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయ్యిందా?

ఓటిటిలో కార్తీ “సర్దార్” రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయ్యిందా?

Published on Nov 11, 2022 1:55 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ చిత్రం “సర్దార్”. తమిళ మంచి థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్ట్ పి ఎస్ మిత్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యి కార్తీ కెరీర్ లో 100 కోట్ల గ్రాసర్ గా నిలిచింది. మరి తెలుగులో కూడా భారీ వసూళ్లు అందుకుని హిట్ గా నిలిచిన ఈ చిత్రం అయితే ఇప్పుడు ఆల్ మోస్ట్ థియేట్రికల్ రన్ ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చింది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై అయితే లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఓటిటి హక్కులు ఆహా సంస్థ కొనుగోలు చేయగా అందులో అయితే ఈ చిత్రం ఈ నవంబర్ 24 నుంచి స్ట్రీమ్ కానున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించగా ప్రిన్స్ మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు