లేటెస్ట్..ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “మైఖేల్”.!

Published on Feb 18, 2023 8:00 am IST

లేటెస్ట్ గా టాలీవుడ్ లో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే గౌతమ్ మీనన్ లాంటి స్టార్ కాస్ట్ తో దర్శకుడు రంజిత్ జేయకొడి తెరకెక్కించిన యాక్షన్ చిత్రం “మైఖేల్” కూడా ఒకటి. మరి మంచి హైప్ మధ్య వచ్చిన ఈ సినిమా అయితే అనుకున్న రేంజ్ సక్సెస్ అయితే కాలేదు.

ఇక ఇప్పుడు అయితే ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ని ఈ సినిమా ఫిక్స్ చేసేసుకుంది. ఈ సినిమా తాలుకా స్ట్రీమింగ్ హక్కులను మన తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆహా వారు సొంతం చేసుకోగా ఇందులో అయితే ఈ సినిమా ఈ ఫిబ్రవరి 24 నుంచి అందుబాటులో ఉండనున్నట్టుగా అనౌన్స్ చేసేసారు. దీనితో ఈ సినిమాని ఓటిటిలో చూడాలి అనుకునేవారు చూడొచ్చు. ఇక ఈ సినిమాలో వరుణ్ సందేశ్ కూడా నటించగా సామ్ సి ఎస్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :