విజయ్ “బీస్ట్” ఓటిటి రిలీజ్ కి డేట్ ఫిక్స్.!

Published on May 4, 2022 11:30 am IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “బీస్ట్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది. అయితే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మిగతా భాషలు మినహా తమిళ్ లో మాత్రం హిట్ స్టేటస్ తెచ్చుకోగలిగింది.

అయితే ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లో ఆల్ మోస్ట్ రన్ ని కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు ఈ సినిమా అన్ని భాషల్లో కూడా ఓటిటి రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఈ చిత్ర స్ట్రీమింగ్ హక్కులని కొనుగోలు చేసిన ప్రముఖ దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో ఈ మే 11 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది అట. అలాగే దీనితో పాటుగా సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కి రానుంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందివ్వగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :