ఓటిటి రివ్యూ : దర్బాన్ – హిందీ చిత్రం (జీ 5 లో ప్రసారం)

నటీనటులు : షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, రసిక దుగ్గల్, ఫ్లోరా సైని, హర్ష్ చయ్యా, సునీతా సేన్‌గుప్తా, వరుణ్ శర్మ

సంగీతం : అమర్త్య బోబో రాహుత్

సినిమాటోగ్రఫీ : అమలేందు చౌదరి

ఎడిటింగ్ : జయంత్ జాతర్, వండిత చక్రడియో

నిర్మాతలు : బిపిన్ నడ్కర్ణి, యోగేష్ బెల్దార్

దర్శకుడు : బిపిన్ నడ్కర్ణి

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో మేము ఎంచుకున్న చిత్రం “దర్బాన్”.స్ట్రీమింగ్ యాప్ జీ 5లో అందుబాటులోకి ఉన్న ఈ చిత్రం ఎలా ఉందో ఇపుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.

కథ :

1960వ దశకం ముగిసే కాలంలో ధన్బాద్ అనే ఒక ప్రాంతానికి చెందిన మైనింగ్ వ్యాపారస్తుడు నరేష్ త్రిపాఠి(హర్స్ చయ్య) దగ్గర పని చేసే అత్యంత నమ్మకవంతుడు రాయ్ చరణ్ తో ఈ చిత్రం మొదలవుతుంది. అలాగే అతడు నరేష్ త్రిపాఠి కొడుకు అంకుల్(సహ్రద్ కేల్కర్)కు కూడా బాగా దగ్గర వ్యక్తిగా కనిపిస్తాడు. అయితే 70వ దశకం మొదలయ్యే సమయానికి ఆ మైనింగ్ అంతటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. దీనితో త్రిపాఠిలు ఆ నగరాన్నే వదిలేసి వెళ్ళిపోతారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అంకుల్ పెద్దయ్యాక మళ్ళీ రాయ్ చరణ్ దగ్గరకు వచ్చి తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరగా అందుకు రాయ్ చరణ్ కూడా ఒప్పుకుంటాడు. కానీ ఇక్కడే ఓ ఊహించని ఘటన ద్వారా అంకుల్ కొడుకు ఒక సమస్యలో ఇరుక్కుంటాడు. మరి ఈ సమస్య రాయ్ చరణ్ కు ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది? అంకుల్ కు చరణ్ కు మధ్య ఎలాంటి ఘటనలకు దారి తీసింది అన్నది అసలు కథ.

ఏమి బాగుంది?

ఈ మధ్య కాలంలో మంచి రోల్స్ తో ఆకట్టుకుంటున్న నటుడు షరీబ్ హష్మీ ఈ చిత్రంలో తనకి ఇచ్చిన మంచి రోల్ అంతే బాగా చేసాడు. అలాగే ఓల్డ్ ఏజ్ లో అతని నటన అలాగే ఎమోషన్స్ ను చాలా బాగా పండించారు. అలాగే ఈ చిత్రంలో మరో కీలక పాత్ర చేసిన నటుడు శరద్ కేల్కర్ తన సపోర్టింగ్ రోల్ మంచి పెర్ఫామెన్స్ ను అందించారు.

అలాగే మరో ప్రముఖ నటుడు రసిక దుగ్గల్ ఈ చిత్రంలో కూడా అద్భుత నటనను కనబరిచాడు. ఇక అలాగే ఈ చిత్రంలోని కథనం, కథను వివరించిన విధానం అలాగే నిర్మాణ విలువలు కానీ డీసెంట్ గా అనిపిస్తాయి. అలాగే మంచి కెమెరా వర్క్ మరియు ఎడిటింగ్ అలాగే ఇంప్రెసివ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. అలాగే పాతకాలపు లుక్ ను కూడా సినిమాలో బాగా చూపించారు.

ఏమి బాగాలేదు?

ఇక ఈ సినిమాలో అంతగా ఆకట్టుకోని అంశాల విషయానికి వస్తే స్టోరీ పెద్దగా కొత్తది అన్నట్టు అనిపించదు. ఇది వరకే ఎప్పుడో చూసేసినట్టే అనిపిస్తుంది సో చాలా వరకు సినిమాను సీన్స్ వారీగా ముందే అంచనా వేసేయ్యొచ్చు. అలాగే మెయిన్ పాయింట్ కు తీసుకెళ్లడానికి కూడా చాలానే సమయాన్ని తీసుకున్నారు. అలాగే క్లైమాక్స్ కూడా అంత కన్విసింగ్ గా అనిపించదు. వీటితో పాటు సెకండాఫ్ కాస్త డల్ గా అనిపిస్తుంది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “దర్బాన్” సినిమా కథ పాతదే అయినా దాన్ని ఓ రకంగా ఆకట్టుకునే విధంగానే మలిచారని చెప్పొచ్చు. నటీనటుల నుంచి మంచి పెర్ఫామెన్స్ అలాగే ఎమోషన్స్ నిర్మాణ విలువలు బాగుంటాయి. కానీ ఊహించగలిగే కథనం అక్కడక్కడా కాస్త డల్ నరేషన్ లను పక్కన పెడితే ఈ సినిమాను ఖచ్చితంగా చూడొచ్చు.

123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :