ZEE5లో దూసుకుపోతున్న “ఆర్ఆర్ఆర్ “.. 10 రోజుల్లోనే 1000 మిలియన్ మినిట్స్..!

ZEE5లో దూసుకుపోతున్న “ఆర్ఆర్ఆర్ “.. 10 రోజుల్లోనే 1000 మిలియన్ మినిట్స్..!

Published on May 31, 2022 7:00 AM IST

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ మల్టీస్టారర్లుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్‌’ చిత్రం ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. థ్రిల్లింగ్ విజువల్స్ తో వీక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రం మే 20 నుంచి తెలుగు, తమిళం, కన్నడ దిగ్గజం భాషల్లో ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 వేదీకగా ప్రసారమవుతూ వస్తుంది.

అయితే ఈ చిత్రానికి డిజిటల్ వేదికగా కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అన్నీ భాషల్లో కలిపి కేవలం 10 రోజుల్లోన్నే ఈ సినిమా 1,000 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకుపోతూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్ మరియు ఇతరులు నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు