ఓటిటిలో “కాంతారా” హిందీ వెర్షన్ ఎప్పుడంటే.!

Published on Dec 6, 2022 9:03 am IST

కన్నడ నుంచి ఈ ఏడాది వచ్చిన పలు సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో డివైన్ హిట్ చిత్రం “కాంతారా” కూడా ఒకటి. దర్శకుడు అలాగే హీరోగా కూడా చేసిన రిషబ్ శెట్టి ఈ చిత్రానికి వర్క్ చేయగా పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం భారీ వసూళ్లు అందుకొని ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం రీసెంట్ గానే తెలుగు కన్నడ సహా ఇతర భాషల్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ గా రాగా ఇక నెక్స్ట్ అంతా హిందీ వెర్షన్ ఓటిటి రిలీజ్ కోసం అయితే చూస్తున్నారు. మరి ఇప్పుడు ఈ అవైటెడ్ హిందీ రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది.

మరి ఈ చిత్రం హిందీ స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా ఈ చిత్రాన్ని వారు ఈ డిసెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకురానున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ చిత్రం ఓటిటి లో అయితే ఎలాంటి సెన్సేషన్ ని నమోదు చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :