ఓటిటి పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న శింబు “ది లైఫ్ ఆఫ్ ముత్తు”

Published on Sep 15, 2022 12:30 pm IST

తమిళ నటుడు శింబు హీరోగా మరొక ఆసక్తికరమైన గ్యాంగ్‌స్టర్ డ్రామా వెందు తనింధతు కాదు తో తిరిగి వచ్చారు. సిద్ధి ఇద్నాని కథానాయికగా నటించిన ఈ బిగ్గీకి స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా OTT రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.

నివేదికల ప్రకారం, స్ట్రీమింగ్ దిగ్గజం భారీ ధరకి హక్కులను కొనుగోలు చేసింది. ఈ సినిమాలో రాధికా శరత్‌ కుమార్‌ కూడా కీలక పాత్ర పోషించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతం అందించారు. ది లైఫ్ ఆఫ్ ముత్తు పేరుతో ఈ సినిమా తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 17, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :