మొత్తానికి చూస్తుండగానే ఏప్రిల్ మూడో వారం కూడా రాబోతుంది. ఐతే, ఈ వారం ‘పాపం ప్రతాప్’, ‘తిమ్మరాజుపల్లి టీవీ’, ‘బ్యాడ్‌బాయ్ కార్తీక్’, ఇక మలయాళ నటుడు టొవినో థామస్, కయాదు లోహర్ జంటగా నటించిన ‘పళ్లి చట్టంబి’ వంటి చిత్రాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్ ఫ్లిక్స్ :
ఉస్తాద్ భగత్ సింగ్ (మూవీ) ఏప్రిల్ 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
యూత్ (మూవీ) ఏప్రిల్ 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈటీవీ విన్ :
మా ఇంటి కథ (మూవీ) ఏప్రిల్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
