బిగ్ బాస్ 5: మాస్ ఎంట్రీ ఇచ్చిన నాగ్…హౌజ్ లోకి 19 మంది సభ్యులు వీరే!

Published on Sep 6, 2021 12:01 am IST

బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి మరొకసారి సిద్దం అయ్యింది బిగ్ బాస్ రియాలిటీ షో. ఈ షో గ్రాండ్ గా ప్రారంభించ బడింది. ఇప్పటి వరకు నాలుగు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఐదవ సీజన్ లోకి అడుగు పెట్టేసింది. గేమ్స్, టాస్క్ లతో అసలు ఆట షురూ కానుంది. అనుబంధాలు, ఆప్యాయతలు, గొడవలు అన్నిటికీ షో సిద్దంగా ఉంది.

ఈ ఐదవ సీజన్ కి అక్కినేని నాగార్జున మరొకసారి వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా ప్రారంభం అయిన ఈ షో లోకి నాగార్జున మాస్ ఎంట్రీ ఇచ్చారు. పంచాక్షరాల సాక్షిగా, పంచేద్రియాల సాక్షిగా, పంచ భూతాల సాక్షిగా, నా పంచ ప్రాణాలు మీరే అంటూ నాగ్ అభిమానులను ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చారు.

సెప్టెంబర్ 5 వ తేదీన ప్రారంభం అయిన ఈ షో లోకి 19 మంది సభ్యులు అడుగు పెట్టారు. మొదటి కంటెస్టెంట్ గా సిరి బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టడం జరిగింది. అలా వరుసగా సన్ని, లహరి, శ్రీరామ చంద్ర, అనీ, లోబో, ప్రియ, జెస్సీ, ప్రియాంక, షణ్ముఖ్, హమీద, నటరాజ్, సరయు, విశ్వ, ఉమా దేవి, మానస్, కాజల్, శ్వేత, చివరగా 19 వ సభ్యుడి గా రవి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

సోమవారం నుండి శుక్రవారం వరకు ఈ కార్యక్రమం రాత్రి 10 గంటలకు ప్రసారం కానుండగా, శని మరియు ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. సెప్టెంబర్ 6 వ తేదీ నుండి అసలు ఆట షురూ కానుంది. ఈ సీజన్ లో ఎవరు విజేత గా నిలుస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :