భారీగా “ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రమోషన్స్!

Published on Aug 18, 2021 5:01 pm IST

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న తాజా కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు. ఈ కార్యక్రమం ఈ నెల 22 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. మొదటి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన షూటింగ్ సైతం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం సోమవారం నుండి గురువారం వరకూ రాత్రి 8:30 గంటలకు జెమిని టీవీ లో ప్రసారం కానుంది.

ఈ కార్యక్రమం ను మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. మెట్రో స్టేషన్ లలో, బస్టాండ్ లలో, పెద్ద పెద్ద హార్డింగ్స్ ద్వారా షో ను ప్రమోట్ చేస్తున్నారు. 22 వ తేదీ రామ్ చరణ్ తో కార్యక్రమం మొదలు కానుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం కి భారీ హైప్స్ ఉండగా, మరింత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :