‘బిగ్ బాస్ 5’ ఎలిమినేషన్..ఈ ఇద్దరిలో ఒకరు అవుట్.!

Published on Sep 18, 2021 5:03 pm IST

ప్రస్తుతం మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ అని తెలిసిందే.. మరి ఇప్పుడు ఈ షో రెండు వారాలు పూర్తి చేసుకుంటుంది. అలాగే ప్రతీ వారం కూడా ఒక ఎలిమినేషన్ ఉంటుందన్న సంగతి కూడా తెలిసిందే. మరి ఈ బిగ్ షో లో రెండో వీకెండ్ కూడా వచ్చింది.

మరి గత వారం ఒక ఎలిమినేషన్ జరగ్గా ఇప్పుడు రెండో వారం ఎలిమినేషన్ కి వచ్చేసింది. అయితే ఈ నామినేషన్ లిస్ట్ లో కాజల్, హమీద, జెస్సి, నటరాజ్ మాస్టర్ అలాగే సన్నీ, ఉమా దేవీలు ఉండగా వీరిలో ఇప్పుడు ఒక ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వారే ఉమా దేవి మరియు నటరాజ్ మాస్టర్ లు అట.

వీరిద్దరూ మిగతా కంటెస్టెంట్స్ తో పోలిస్తే తక్కువ ఓటింగ్ తో వెనక పడి ఉన్నారట. దీనితో బహుశా ఈ ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. మరి వీరిలో ఎవరు బయటకి వెళ్లనున్నారో తెలియాలి అంటే రేపటి వరకు ఆగి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :