ఓటీటీలో ‘పరాశక్తి’ దూకుడు.. అప్పుడే 100 మిలియన్ మార్క్..!

Parasakthi

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘పరాశక్తి’ (Parasakthi )థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, ఓటీటీలో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. అయితే, ఫిబ్రవరి 7, 2026న ZEE5 ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ ప్రీమియర్ అయిన తర్వాత ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది.

కేవలం మూడు రోజుల్లోనే అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి ఈ సినిమా ఓటీటీలో ఒక మైలురాయిని అందుకుంది. థియేటర్ల కంటే డిజిటల్ వేదికపైనే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎక్కువగా ఆదరిస్తుండటం విశేషం. పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ సీక్వెన్స్‌లు హోమ్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి.

సుధాకర్ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శివకార్తికేయన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, అథర్వ మరియు రవి మోహన్ కీలక పాత్రలు పోషించారు. డాన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Exit mobile version