మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో.!

Published on Jul 29, 2021 5:12 pm IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించడంలో ఈటీవీ ఛానెల్ కూడా ముందు ఉంటుంది అని అందరికీ బాగా తెలుసు. అటు టెలివిజన్ పైన అయినా కూడా మరోపక్క యూట్యూబ్ నుంచి అయినా కూడా సాలిడ్ రెస్పాన్స్ నే వారి షోస్ మరియు ఈవెంట్లు అందుకుంటాయి.

అయితే ఈసారి ఫార్మాట్ లో చిన్న చేంజ్ చేసి ప్రతీ ఆదివారం కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించే విధంగా ప్లాన్ చేసిన షోనే “శ్రీదేవి డ్రామా కంపెనీ”. సుడిగాలి సుధీర్ యాంకరింగ్ లో ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి ప్రసారం అవుతున్న ఈ షో గత నాలుగైదు వారాల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటుందట.

అంతే కాకుండా గత వారపు ఎపిసోడ్ కూడా చాలా మంచి టీఆర్పీ రేటింగ్ ను అందుకున్నట్టు తెలుస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న అనేకమంది టాలెంట్ లను పరిచయం చెయ్యడమే కాకుండా వారి స్పెషల్ స్కిట్స్ మరియు పెర్ఫామెన్స్ లతో ఎంటర్టైన్ చెయ్యడమే ప్రధాన కారణం అని చెప్పాలి. మొత్తానికి మాత్రం ఈ షో మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :