బిగ్ బాస్ 5 లో పాల్గొనే సెలబ్రిటీ లు వీళ్లేనా?

Published on Aug 3, 2021 6:01 pm IST

బుల్లితెర ప్రేక్షకులు ఇటీవల కాలంలో తాజాగా ఎదురు చూస్తున్న కార్యక్రమం బిగ్ బాస్ రియాలిటీ షో. అయితే ఇప్పుడు అయిదవ సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ బిగ్ బాస్ కి సంబంధించిన లోగో ను మార్చివేయడం జరిగింది. సరికొత్త లోగో తో ఈ ఏడాది కనబడనుంది. అయితే ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నది ఏమిటంటే? ఈ బిగ్ బాస్ షో లో ఈ ఏడాది కనబడే సెలబ్రిటీ లు ఎవరు అని.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది యూ ట్యూబ్ స్టార్ షణ్ముఖ్, కమెడియన్ లోబో, ఆర్ జే కాజల్, యాంకర్ నిఖిల్, యాంకర్ రవి, సురేఖ వాణి, ప్రియా రామన్, ఇషా చావ్లా, యూ ట్యూబర్ సిరి హనుమంతు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ షురూ అయినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :