భారీ రెస్పాన్స్ తో అదిరే ఆన్సర్ ఇచ్చిన “టక్ జగదీష్”

Published on Sep 15, 2021 1:00 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “టక్ జగదీష్”. దర్శకుడు శివ నిర్వాణం తెరకెక్కించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇటీవల పలు కారణాల చేత ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. అయితే సినిమా రిలీస్ అయ్యాక ఊహించని విధంగా మిక్సిడ్ టాక్ వీక్షకుల నుంచి వచ్చింది. చాలా మంది బాగుంది అనుకుంటే మరికొందరు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ నే అందించారు.

కానీ వారందరికీ “టక్ జగదీష్” సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడని చెప్పాలి. ఇప్పుడు టక్ జగదీష్ చిత్రం ప్రైమ్ వీడియోలో తెలుగు భాష వరకు అత్యధికంగా చూసిన సినిమాగా సరికొత్త రికార్డు సెట్ చేసింది. భారీ వ్యూవర్ షిప్స్ తో టక్ జగదీష్ సినిమా ప్రైమ్ వీడియోలో టాప్ కి వచ్చిందట. గతంలో రిలీజ్ అయ్యిన ‘వి’ కి కూడా ఆ ఏడాదికి భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం వల్ల మరింత మంది చూడడానికి మొగ్గు చూపారు. సో ఫైనల్ గా ఈ రికార్డు నాని ఖాతాలో పడింది.

సంబంధిత సమాచారం :