“టక్ జగదీష్” రికార్డ్ ను “మాస్ట్రో” బీట్ చేస్తుందా!?

Published on Sep 16, 2021 5:39 pm IST

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్ల తో పాటుగా, ఆన్లైన్ ద్వారా సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇప్పటి వరకు డైరెక్ట్ ఓటిటి గా విడుదల అయిన తెలుగు చిత్రాల్లో టక్ జగదీష్ చాలా పెద్ద చిత్రం అని చెప్పాలి.అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రస్తుతం ఈ చిత్రం ప్రసారం అవుతోంది. ఇప్పుడు నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో చిత్రం నేడు రాత్రి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

అయితే టక్ జగదీష్ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, అమెజాన్ ప్రైమ్ వీడియో లో రికార్డు వ్యూస్ ను సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఎక్కువగా చూసిన తెలుగు చిత్రం ఇప్పుడు నాని టక్ జగదీష్ చిత్రం కావడం విశేషం. ఇప్పుడు నితిన్ హీరోగా వస్తున్న మాస్ట్రో చిత్రం ఆ తరహాలో రికార్డ్ సెట్ చేస్తుందా లేదా అనే దాని పై చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా అంధ దూన్ చిత్రానికి రీమేక్ అవ్వడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :