“బిగ్ బాస్” హౌజ్ నుండి సరయు ఔట్..!

Published on Sep 12, 2021 11:26 pm IST

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్. ప్రతి ఏడాది ఎన్నో టాస్క్ లు, గొడవలు, ఫైట్స్, లవ్ అండ్ ఎమోషన్స్ తో కొనసాగుతున్న ఈ షో, ఈ ఏడాది కూడా సరికొత్తగా మొదలైంది. ఊహించని విధంగా ఈ షో నుండి సరయు ఎలిమినేట్ అయ్యింది.

మొదటి వారం యూ ట్యూబ్ స్టార్ అయిన సరయ ఎలిమినేట్ అవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది అని చెప్పాలి. ఎలిమినేషన్ ప్రక్రియ కొరకు రవి, హమీద, జస్వంత్, మానస్, కాజల్, సరయు నామినేట్ కాగా, జెస్సీ మరియు సరయు మిగిలారు. ఈ మేరకు చివరగా సరయు ఎలిమినేట్ అయినట్లు గా నాగార్జున ప్రకటించడం జరిగింది. ఈ ఏడాది తొలి కంటిస్టెంట్ సరయు బయటికి వెళ్తూ కన్నీరు పెట్టుకుంది.

సంబంధిత సమాచారం :